- శాంతించని అభ్యర్థులు.. పేపర్ 2ను పూర్తిగా తొలగించాలని డిమాండ్
- ఆగస్టు 24నే ప్రిలిమ్స్: యూపీఎస్సీ
-
2011లో పరీక్ష రాసిన వారికి 2015లో మళ్లీ అవకాశం
పార్లమెంటులో రభస..
ఈ అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. రాజ్యసభలో గందరగోళం చెలరేగి సభ ఒకసారి వాయిదా పడింది. జితేంద్రసింగ్ ప్రకటన రాజ్యసభలో ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఐ, డీఎంకే, తృణమూల్, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ, జేడీయూ పార్టీల సభ్యులను శాంతింపచేయలేదు. సివిల్స్ అభ్యర్థులు ఈ పరీక్షను తమ మాతృభాషలో రాసే అవకాశముందా? లేదా? అనే విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని వారు డిమాండ్ చేశారు. సీశాట్ వివాద పరిష్కారానికి నిర్దేశిత గడువు విధించాలని డిమాండ్ చేశారు. కాగా, నేపాల్ పర్యటన నుంచి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి జితేంద్రసింగ్‌లు ఈ అంశంపై తాజా పరిణామాలను వివరించారు.
No comments:
Post a Comment