-విభజన చట్టం ప్రకారమే నోటిఫికేషన్
-తెలంగాణ విద్యామండలి ద్వారా జారీచేస్తాం
-14 లేదా 15 నుంచి కౌన్సెలింగ్
-31లోగా ప్రక్రియ పూర్తిచేస్తాం
-ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టీ పాపిరెడ్డి
రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 75 ప్రకారమే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ టీ పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఎంసెట్ కౌన్సెలింగ్ గడువుపై సుప్రీంకోర్టు తుదితీర్పు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని తెలిపారు. ఈ తీర్పులో 1956 స్థానికత, ఫాస్ట్ పథకానికి సంబంధించి ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. దీంతో రాష్ట్రంలో సొంతంగానే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించుకోవడానికి మార్గం సుగమమైందన్నారు.
సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ప్రవేశాల నిర్వహణ కోసమే రాష్ట్ర ఉన్నత విద్యామండలిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని, దీని ద్వారానే తెలంగాణలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందని సుప్రీంకోర్టుకు తెలియజేశామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో సరైన యంత్రాంగం లేకపోవడం, అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తికాకపోవడం వంటి కారణాల వల్ల జూలై 31 నాటికి పూర్తి కావాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ కోసం అక్టోబర్ నెలాఖరు వరకు గడువు కోరామని వివరించారు. దీంతో సుప్రీంకోర్టు స్పందించి ఆగస్టు 31వరకు కౌన్సెలింగ్ గడువు పొడిగించిందని, సెప్టెంబర్ 1నుంచి తరగతులు ప్రారంభించాలని తీర్పులో పేర్కొందని తెలిపారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పాపిరెడ్డి స్పష్టంచేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. ఆ మేరకు కౌన్సెలింగ్ పూర్తిచేసి, సీట్లు కేటాయించడంతోపాటు కాలేజీలలో రిపోర్టు చేయడానికి కావాల్సిన షెడ్యూల్ తయారుచేయడానికి తెలంగాణ విద్యా మండలి సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం ఎంసెట్-2014ను నిర్వహించిన జేఏన్‌టీయూ హైదరాబాద్ కూడా తెలంగాణలో భాగంగా ఉంది కాబట్టి ఎంసెట్ నిర్వహణ, షెడ్యూల్, విధివిధానాలు ఖరారు చేయడంలోనూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలే ముందు ఉంటుందని పాపిరెడ్డి చెప్పారు.
ఒకటి రెండు రోజుల్లో ఉన్నత విద్యా మండలి సమావేశం అవుతుందని, ఆ సమావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి తాజా షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. షెడ్యూల్ ప్రకటించడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి నుంచి ఇద్దరు ప్రతినిధులను ఆహ్వానించి.. ఉమ్మడి కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 14 లేదా 15వ తేదీ నుంచి ప్రారంభించి ఈ నెల 23 నాటికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తోపాటు రెండు మూడు రోజుల విరామంతో కాలేజీలు, సీట్ల (ఆప్షన్ల) ఎంపిక చేసుకోవడానికి వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రవేశాలకు (15 శాతం) కోటా సీట్ల భర్తీకి విఘాతం కలుగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు. విభజన చట్టంలో 371 డీ ఆర్టికల్ ప్రకారమే ఉన్నత విద్యలో అడ్మిషన్ల విధానాన్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఈ విషయంలో తెలంగాణ పిల్లలు ఎవరూ ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని పాపిరెడ్డి భరోసా ఇచ్చారు.
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి తాజా పరిణామాలపై వారు చర్చించినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణలో ప్రత్యేక కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీచేయాలని విద్యా మండలి చైర్మన్‌ను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఉన్నత విద్యా మండలి సమావేశాన్ని ఏర్పాటుచేసి, కౌన్సెలింగ్ షెడ్యూల్, ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలని చైర్మన్‌కు సూచించినట్టు సమాచారం.

ఈ నెలాఖరులోగా కౌన్సెలింగ్ పూర్తి..

ప్రత్యేక నోటిఫికేషన్ జారీకి సీఎం ఆదేశం!
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి తాజా పరిణామాలపై వారు చర్చించినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణలో ప్రత్యేక కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీచేయాలని విద్యా మండలి చైర్మన్‌ను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఉన్నత విద్యా మండలి సమావేశాన్ని ఏర్పాటుచేసి, కౌన్సెలింగ్ షెడ్యూల్, ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలని చైర్మన్‌కు సూచించినట్టు సమాచారం.
No comments:
Post a Comment